ఇండియన్ 2 కోసం మేకర్స్ భారీ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్( Kamal haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమా( Vikram movie )తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో రెండేళ్ల క్రితం ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.రెండేళ్ల క్రితం ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అనేక కారణాల వల్ల రెండేళ్ల పటు వాయిదా పడింది.

భారతీయుడు సినిమా( Indian 2 )కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.అప్పట్లో శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇదే కాంబోలో సీక్వెల్ వస్తుంది అంటే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను మేకర్స్ 6 గంటల ఫుటేజ్ చిత్రీకరించారని అందుకే ఇండియన్ 2 సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇండియన్ 2 లో సబ్ ఫ్లాట్ లు చాలా ఉన్నాయని ఇది మరో భాగంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.

Advertisement

మరి ఇందులో నిజమెంతో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంయుక్తంగా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

కాజల్ అగర్వాల్,( Kajal Agarwal ) రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి రిలీజ్ వచ్చే ఏడాది ఉంటుంది అని అంటున్నారు.

చూడాలి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు