ఆసియా క్రీడల్లో భారత్ కు స్వర్ణం..!

ఆసియా క్రీడలలో( Asian Games ) భాగంగా భారత్ కు ఆరవ స్వర్ణం లభించింది.పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలోని జట్టు( Air Pistol Mens Team ) భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.

 India Win Gold Medal In Mens 10m Air Pistol Team Event Details, India ,gold Meda-TeluguStop.com

సరబ్ జ్యోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా తో కూడిన భారత జట్టు స్వర్ణం సాధించడం తో భారత్ ఖాతాలో ఆరవ స్వర్ణం చేరింది.ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు టీం ఈవెంట్ లో భారత త్రయం 1734.50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.సొంత వేదికపై జరిగిన క్రీడల్లో చైనా 1733.62 పాయింట్లు సాధించి రజతంతో సరిపెట్టుకుంది.

అంతేకాదు ఆసియా క్రీడల్లో భాగంగా సరబ్ జ్యోత్ సింగ్, అర్జున్ సింగ్ ఏకంగా టాప్ టెన్ లో అర్హత సాధించారు.సరబ్ జ్యోత్ సింగ్( Sarabjot Singh ) ఐదవ స్థానంలో ఉండగా.అర్జున్ సింగ్( Arjun Singh Cheema ) ఎనిమిదవ స్థానంలో నిలిచాడు.

అంతకుముందు వుషు స్టార్ ప్లేయర్ రోషిబినా దేవి మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది.ఇక ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల జాబితాను పరిశీలిస్తే.

భారత్ ఏకంగా 24 మెడల్స్ తో ప్రస్తుతం ఐదవ స్థానంలో నిలిచింది.

ఈ 24 మెడల్స్ లలో ఆరు బంగారు పతకాలు ఉండగా.8 సిల్వర్ పతకాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ క్రీడలలోని అన్ని విభాగాలలో ముందుకు దూసుకు వెళ్తోంది.

ఇక క్రికెట్( Cricket ) విషయానికి వస్తే కూడా ఈ ఏడాది భారత పురుషుల జట్టు, భారత మహిళల జట్టు సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ టైటిల్స్ సాధిస్తూ ముందుకు వెళ్తున్నాయి.ప్రపంచ దేశాలలో జరిగే అన్ని వేదికలపై భారత్ క్రీడ రంగంలో తన సత్తా ఏంటో చాటుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube