నేడే వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్.. బ్యాటింగ్ లో రాణిస్తేనే..!

భారత్-వెస్టిండీస్( Ind vs WI ) మధ్య ఐదు టీ20 ల సిరీస్ ను భారత్ ఓటమితో ఆరంభించింది.నేడు జరిగే రెండో టీ20 మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకొని గెలవాలని భారత్ గట్టి పట్టుదలతో బరిలోకి దిగబోతుంది.

 India Vs West Indies Second T20 Match Today Details, India Vs West Indies ,secon-TeluguStop.com

మరొకవైపు తొలి మ్యాచ్ గెలిచిన జోష్ లో ఉన్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో గెలవాలని తెగ ఆరాటపడుతోంది.అయితే భారత జట్టు( Team India ) బ్యాటింగ్ లో రాణిస్తేనే విజయాలు భారత్ ఖాతాలో పడతాయి.

ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం పొందితే విజయం చేజారే అవకాశం ఉంది.

తొలి మ్యాచ్లో భారత బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్ 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కానీ భారత బ్యాటర్లు రాణించలేకపోవడంతో నాలుగు పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూసింది.నేడు జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే.కెప్టెన్ హార్థిక్ పాండ్యా,( Hardik Pandya ) వైస్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్,( Surya Kumar Yadav ) ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్, సంజూ శాంసన్ బ్యాటింగ్లో అద్భుత ఆటను ప్రదర్శించాల్సిందే.అప్పుడే ఈ ఆటగాళ్లకు వన్డే వరల్డ్ కప్ లో జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది.

Telugu Chahal, Hardik Pandya, India, Kuldeep Yadav, Subhman Gill, Tilak Varma-Sp

ఐపీఎల్ లో అదరగొట్టిన శుబ్ మన్ గిల్( Subhman Gill ) ఒక్కసారిగా వెనుకబడ్డాడు.డబ్ల్యూటీసి ఫైనల్ నుంచి ఇప్పటివరకు గిల్ ఆడిన 9 ఇన్నింగ్స్ లలో కేవలం ఒక్కసారి మాత్రమే 50+ స్కోరు చేశాడు.కాబట్టి గిల్ తనను తాను నిరూపించుకుంటేనే భవిష్యత్తులో జట్టులో అవకాశం పదిలంగా ఉంటుంది.

Telugu Chahal, Hardik Pandya, India, Kuldeep Yadav, Subhman Gill, Tilak Varma-Sp

టీమ్ మేనేజ్మెంట్ కూడా గిల్ ను పక్కకు పెట్టకుండా అవకాశాలు ఇస్తోంది.తిలక్ వర్మ( Tilak Varma ) తన ఆరంగేట్ర మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే.

స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ చక్కగా రాణించారు.పేసర్లు అర్షదీప్, ముకేశ్ తమ సత్తా ఏంటో చాటారు.

కాబట్టి భారత్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త మెరుగుగా రాణిస్తే విజయం భారతదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube