నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల తొలి టీ20 మ్యాచ్..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( India vs England ) మహిళల క్రికెట్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు తొలి టీ20 మ్యాచ్ ముంబైలోని వాఖండే వేదికగా( Wankhede Stadium ) ఉత్కంఠ భరితంగా జరగనుంది.భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ గెలవడం ఒక పెద్ద సవాల్.

 India Vs England Womens First T20 Match Today Details, India Vs England, Womens-TeluguStop.com

హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.భారత మహిళల జట్టు ఈ 2023లో టీ20 ఫార్మాట్ లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడంతోపాటు బంగ్లాదేశ్ పై 2-1 తేడాతో సిరీస్ సాధించింది.

అంతేకాదు దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు టోర్నీలో కూడా భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరింది.

Telugu Ind Eng, India England, India Cricket, Smriti Mandhana, Womens Cricket-Sp

భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తున్న కూడా స్వదేశంలో ఇంగ్లాండ్ పై భారత్ కు చెప్పుకోదగ్గ గొప్ప రికార్డులు అయితే ఏమీ లేవు.ఈ రెండు జట్ల మధ్య 9 మ్యాచులు జరిగితే భారత్ గెలిచింది కేవలం రెండు మ్యాచ్లే.2018 లో ఇంగ్లాండ్ పై చివరగా భారత్ విజయం సాధించింది.ఈ టీ20 సిరీస్( T20 Series ) గెలవాలంటే భారత జట్టులో బ్యాటర్లైన స్మృతి మంధాన, జెమీయా రోడ్రిగ్స్, కెప్టన్ హార్మన్ ప్రీత్ కౌర్ తప్పక రాణించాల్సి ఉంది.

Telugu Ind Eng, India England, India Cricket, Smriti Mandhana, Womens Cricket-Sp

మరొకవైపు ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై శ్రీలంక చేతిలో ఓడిన ఇంగ్లాండ్ ఎలాగైనా భారత్ పై చేయి సాధించాలని భావిస్తోంది.అయితే భారత పిచ్ లపై ఇంగ్లాండ్ రాణించడం కూడా ఒక పెద్ద సవాలే.భారత్ లో వేడి, ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొని అద్భుత ఆటను ప్రదర్శించడం కాస్త కష్టమే.

అయితే ఇంగ్లాండ్ జట్టుకు తమ ఆటను మెరుగుపరచుకోవడానికి భారత్ సరైన వేదిక.ఎందుకంటే.2024 టీ20 ప్రపంచ కప్( 2024 T20 World Cup ) వేదిక బంగ్లాదేశ్ లో పిచ్ ల మాదిరే భారత పిచ్ లు ఉంటాయి.భారత జట్టు ఎప్పటిలాగే భయం లేకుండా తనదైన శైలిలో ఆడితే ఇంగ్లాండ్ పై పైచేయి సాధించడం పెద్ద కష్టం కాదని క్రికెట్ నిపుణుల అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube