భారత్-చైనాల( India-China ) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, భారత వైమానిక దళాలు సమాచారాన్ని పంచుకునే ఒప్పందంపై పనిచేస్తున్నాయని అగ్రరాజ్యానికి చెందిన ఓ అత్యున్నత సైనికాధికారి మంగళవారం మీడియాకు తెలిపారు.యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్( Frank Kendall ) సైతం జెట్ ఇంజిన్ టెక్నాలజీని పంచుకోవడానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు భారత్-అమెరికాలు దగ్గరగా వున్నాయన్నారు.
దీని వల్ల ఇండియా యుద్ధ విమానాల ఇంజిన్‌లను దేశీయంగా ఉత్పత్తి చేయడంలో దోహదపడుతుందన్నారు.
భారత్ అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామి అని.తాము విలువలను పంచుకోవడమే కాకుండా, సంబంధాలను విస్తరిస్తున్నామని సదరు అధికారి పేర్కొన్నారు.ఎయిర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్( Air Information Sharing ) ఒప్పందంపై ఇరుపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.
ఉమ్మడి ప్రయోజనాల కోసం ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు సీనియర్ అధికారి స్పష్టం చేశారు.ఆత్మ నిర్భర్ భారత్‌పై అమెరికా ఆందోళన చెందుతుందా అని మీడియా ప్రశ్నించగా.
భారతదేశంలో తయారు చేయబడిన ఉత్పత్తులలో ఎక్కువ వాటాను కలిగి వుండాలనే ఆవశ్యకతను దశలవారీగా అమలు చేయాలన్నారు.

ఇదిలావుండగా భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( Minister Dr S Jaishankar ) మంగళవారం అమెరికా వైమానిక దళ కార్యదర్శి ఫ్రాంక్ కెండాల్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై కొత్త అవకాశాలపై చర్చించారు.ఈ సమావేశం తర్వాత జైశంకర్ ట్వీట్ చేస్తూ.
యూఎస్ వైమానిక కార్యదర్శి ఫ్రాంక్ కెండాల్‌ను కలుసుకోవడం ఆనందంగా వుందన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జై శంకర్( Jai Shankar ), ఫ్రాంక్ కెండాల్ మధ్య జరిగిన సమావేశం కీలకమైనది.
ఇటీవలే భారత సంతతికి చెందిన రవి చౌదరి తొలిసారిగా వైమానిక దళ సహాయ కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే.

ఇకపోతే.యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా భారత సంతతికి చెందిన రవి చౌదరిని( Ravi Chaudhary ) నామినేట్ చేస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ ఆమోదముద్ర వేసింది.65-29 ఓట్ల తేడాతో సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది.అంతేకాదు.రవి చౌదరికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో డజను మందికి పైగా రిపబ్లికన్లు వుండటం విశేషం.






