కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయుడు సహా నలుగురు దుర్మరణం

క్రిస్మస్ పర్వదినం వేళ కెనడాలో విషాదం చోటు చేసుకుంది.బస్సు బోల్తా పడిన ఘటనలో భారత సంతతి వ్యక్తి సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు.

 India-origin Man From Punjab Among 4 Killed In Bus Accident In Canada Details, I-TeluguStop.com

రహదారిపై పేరుకుపోయిన మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.మృతి చెందిన భారతీయుడిని పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి చెందిన కరణ్‌జిత్ సింగ్ సోధి (41)గా గుర్తించారు.

మిగిలిన వారిని కెనడా అధికారులు గుర్తించాల్సి వుంది.డిసెంబర్ 24న వాంకోవర్ – కెలోవ్నా మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సర్రే కేంద్రంగా పనిచేస్తున్న పంజాబీ వార్తాపత్రిక అకల్ గార్డియన్ ఎడిటర్ గుర్‌ప్రీత్ ఎస్ సహోటా ట్వీట్ చేశారు.

ఇక కరణ్‌జిత్ ఒకానగాన్ వైనరీకి చెందిన రెస్టారెంట్‌లో చెఫ్‌గా ఉద్యోగం చేస్తున్నాడని.తన భార్య, కుమారుడు, కుమార్తెను పంజాబ్‌లోనే వుంచి అతను కెనడాకు వచ్చినట్లు గుర్‌ప్రీత్ తెలిపారు.

అంతకుముందు ఈ బస్సు ప్రమాదంలో నలుగురు మరణించినట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ధ్రువీకరించారు.ప్రమాద విషయం తెలుసుకున్న అనంతరం మూడు ఏరియా ఆసుపత్రులకు చెందిన వైద్య బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 53 మందికి చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది.

అత్యవసర పరిస్ధితి, క్షతగాత్రుల సంఖ్య భారీగా వున్నందున బాధితుల గుర్తింపు ఆలస్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Telugu Bus, Amritsar, Canada, Canadabus, Gurpreet Sahota, India Origin, Indo Can

బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ ప్రాంతంలో వడగాళ్ల వాన కురవడంతో పాటు విపరీతంగా మంచు కురిసిందని అధికారులు తెలిపారు.ప్రమాదంలో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఇంటీరియర్ హెల్త్ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇదిలావుండగా… గత వారం కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు దుర్మరణం పాలయ్యాడు.మృతుడిని మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు.డిసెంబర్ 13న ఉదయం 7 గంటలకు మిస్సిసాగాలోని కోర్ట్నీ పార్క్ డ్రైవ్ , ఎడ్వర్డ్స్ బౌలే‌వార్డ్ వద్ద ఓ రవాణా ట్రక్ ఢీకొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.

మిస్సిసాగాలోని ఒక ఫ్యాక్టరీలో మన్‌ప్రీత్ పనిచేస్తున్నాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube