ప్రస్తుతం భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ మంచి జోరు మీద ఉంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్ వంటి దేశాలపై పూర్తి ఆధిపత్యం వహించి పలు సిరీస్ లను కైవసం చేసుకుంది.
అయితే తాజాగా ఈ నెల 14వ తారీకు నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్నటువంటి వన్డే సిరీస్ కి భారత జట్టునీ బీసీసీఐ ప్రకటించింది.అయితే ఇందులో భాగంగా విశ్రాంతి కారణంగా జట్టుకు దూరమైన టువంటి డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి మళ్లీ జట్టులోకి రానున్నాడు.
అయితే ఇతడికి జోడిగా వచ్చేటువంటి శిఖర్ ధావన్ కి తుది జట్టులో చోటు ఈ విషయంపై కొంత సందిగ్ధత నెలకొంది.ఎందుకంటే ఇప్పటికే గాయం కారణంగా దూరమైన టువంటి శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ గత కొద్దికాలంగా తనకు వచ్చినటువంటి అవకాశాలను అంది పుచ్చుకుంటూ నిలకడగా రాణిస్తున్నాడు.
దాంతో ప్రస్తుతం జట్టులో శిఖర్ ధావన్ స్థానంపై నీలి నీడలు ఆవహించినట్లు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా రెండు మూడు స్థానాల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లు ఉండనే ఉన్నారు.
అయితే ఐదవ స్థానంలో సరైన బ్యాట్స్మెన్ లేనందువలన ఈసారి ఆల్ రౌండర్ జడేజాకి అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక బౌలింగ్ విభాగానికి వస్తే పేసర్ మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా లు ఇప్పటికే తమ స్థానాలను కైవసం చేసుకున్నారు.
అయితే గత కొద్దికాలంగా మంచి ఫామ్ లో ఉన్నటువంటి నవదీప్ సైనీ ఎంపిక కుడా దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా జట్టు కూడా పటిష్టంగానే కనిపిస్తోంది.అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గణాంకాలను చూసుకుంటే భారత్ లో జరిగినటువంటి మ్యాచుల్లో ఎక్కువ శాతం భారత జట్టు విజయం సాధించింది.దీంతో మరోసారి ఈ గణాంకాలను పదిలంగా ఉంచుకోవడానికి కోహ్లీసేన సిద్ధమవుతోంది.
ఈ మూడు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా రేపటి రోజున ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి.