ఇటీవలే కాలంలో జరిగిన ఐసీసీ ఈవెంట్ లలో టీంఇండియా లీగ్, గ్రూప్ దశలలో అద్భుతంగా రాణిస్తూ ఓటమి అనేదే ఎరుగకుండా ఫైనల్ చేరి, ఫైనల్ మ్యాచ్లో( Final Matches ) మాత్రం ఓటమిలను ఎదుర్కొంటోంది.9 నెలల వ్యవధిలో జరిగిన మూడు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన భారత జట్టు( Team India ) ఓటములకు ఆస్ట్రేలియానే( Australia ) కారణం.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్, అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓటములను చవిచూసింది.భారత సీనియర్ ఆటగాళ్లే కాదు జూనియర్ ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియాపై గెలవలేక చేతులెత్తేశారు.
గత రెండు సంవత్సరాలుగా అద్భుతస్థాయిలో రాణిస్తున్న భారత జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023( ICC WTC 2023 ) ఫైనల్ మ్యాచ్లో కనీసం ఆస్ట్రేలియాకు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది.భారత సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023( World Cup 2023 ) టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టి.
వరుస విజయాలతో ఫైనల్ చేరిన భారత జట్టు చివరికి ఆసీస్ గండాన్ని దాటలేక ఓటమిని చవిచూసింది.

తాజాగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2024 లో ( U-19 World Cup 2024 ) లీగ్ దశ నుండి వరుసగా విజయాలు సాధించి ఫైనల్ చేరిన భారత యువ జట్టు ఆస్ట్రేలియా జట్టుకు కనీస పోటీ ఇవ్వలేక చిత్తుగా ఓడింది.క్రికెట్ అభిమానులకు భారత జట్టు మరోసారి గుండె కోత మిగిల్చింది.9 నెలల వ్యవధిలో ఏకంగా భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలవక పోవడానికి ఆస్ట్రేలియా అనే కారణం కావడం చాలా బాధాకరం.భారత జట్టు ఆస్ట్రేలియా గండాన్ని దాటలేదా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

తాజాగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టులో ఆదర్శ సింగ్ 47, మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేశారు.మిగిలిన భారత జట్టు బ్యాటర్లు రాణించలేకపోయారు.దీంతో భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆల్ అవుట్ అయి ఓటమిని చవిచూసింది.