ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో స్వాతంత్రం వేడుకలు

అమీర్పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 Independence Day Celebrations At Prajashanthi Party Office Independence Day Ce-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ళ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ప్రస్తు తరణంలో కూడా దేశంలో వివక్షత కొనసాగడం విచారకరమని అన్నారు. రాజస్థాన్లో 9 ఏళ్ల బాలుడు నీళ్లు తాగినందుకు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.

స్వాతంత్రం వచ్చింది కొన్ని వర్గాలకేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రజాశాంతి పార్టీ అభిమాని అన్నారు.

రాష్ట్రంలో ఇదే పందా కొనసాగుతుందని అద్దంకి దయాకర్ ఆవేశంలో ఓ మాట జారినందుకు పలుమార్లు క్షమాపణలు కోరిన అతనిపై కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఉపక్రమిస్తుందని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో మునుగోడు కేవలం రెడ్డిలదే కాదని ఈసారి బీసీ దళిత వర్గాలకు చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

పార్టీలు కలిసి రాని సందర్భంలో మునుగోడు లోని ప్రజలను తాము చైతన్యం కల్పిస్తామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube