పల్లెటూళ్లలో కూడా వంట విధానం మారిపోయింది.మారిపోతున్న రోజులకు అనుగుణంగా తమ ఇళ్లల్లో గ్యాస్ పొయ్యిలు వచ్చి చేరిపోతున్నాయి.
కట్టెల పొయ్యిలో వంట చేసుకోవడం దాదాపు కనుమరుగైపోయింది.అయితే గ్యాస్ మీద అంతగా అవగాహన లేకపోవడంతో, అలాగే కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లు పేలిపోయిన ఘటనల వలన కొంతమంది సిలిండర్ అంటే భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ గ్యాస్ ఏజెన్సీ ఇండేన్ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.ఈ ప్రయోగం ప్రజల బాలిట ఓ వరంలా మారనుంది.
ఇప్పటికే ఎన్నో ప్రదేశాలలో గ్యాస్ సిలిండర్లు పేరే కుటుంబాలు మొత్తం చనిపోయిన ఘటనలు, ఇల్లు కోల్పోయిన ఘటనలు మనం ఎన్నింటినో చూసాం.ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నపుడు వారికి ఒకే విషయం బోధ పడింది.
అదే సిలిండర్.సిలిండర్ మార్పు విషయంలో కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు వుంటాయని సదరు సంస్థ ఆలోచించింది.
ఆ దిశగా అడుగులు వేసింది.దాంతో ఈ గ్యాస్ సిలిండర్ ను బ్లాస్ట్ ప్రూఫ్ పద్ధతిలో తయారుచేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించింది.

దీనిని ఇండేన్ పేరిట IOCL గ్యాస్ సిలిండర్ ల పేరుతో సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా రూపొందించిన ఈ కొత్త సిలిండర్ ఎటువంటి పరిస్థితులలో కూడా పేలదని చెబుతున్నారు.అయితే మామూలుగా మనం ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లలో 14 కేజీల గ్యాస్ వరకు నిలువ చేసుకోవచ్చు.అయితే కొత్తగా తయారు చేసిన ఈ బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్ లో మాత్రం కేవలం 10 కేజీలు మాత్రమే గ్యాస్ వస్తుంది.
ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉండాల్సిన అవసరం వుంది.ఇక ఈ సిలిండర్ ను తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి ఆవిష్కరించడం జరిగింది.