ఏపీలో కోవిడ్ (Covid) చాపకింద నీరులా వ్యాపిస్తుంది.దీంతో క్రమక్రమంగా కోవిడ్ కేసుల (Covid Cases) సంఖ్య పెరుగుతోంది.
కేవలం 45 రోజుల్లోనే 189 పాజిటివ్ కేసులు (Positive Cases) నమోదు అయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) మరియు ఎన్టీఆర్ జిల్లా ( NTR District) లో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక (Karnataka) తరువాత ఏపీ (AP)లోనే కేసుల సంఖ్య పెరుగుతోంది.కాగా మొత్తం కేసుల్లో 70 శాతం కొత్త వేరియంట్ జేఎన్ -1 (New Variant JN-1) కేసులుగా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.