కెనడాలో( Canada ) జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతోంది.మరోవైపు వలసదారుల సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది.
దీనివల్ల అక్కడ కనీస అవసరాలు కూడా పొందలేని పరిస్థితి ఏర్పడింది.ఈ ఆర్థిక ఒత్తిడి చాలా మంది మంచి అవకాశాల కోసం దేశం విడిచి వెళ్లేలా చేస్తోంది.
ఇటీవలి డేటా ఈ ట్రెండ్ ఎలా ఉందో వెల్లడించింది.దాని ప్రకారం 2023 మొదటి అర్ధ భాగంలో, కెనడా నుంచి దాదాపు 42,000 మంది వలసపోయారు.
రాయిటర్స్ నివేదించిన అధికారిక రికార్డుల ప్రకారం 2022లో 93,818 మంది, 2021లో 85,927 మంది వెళ్లిపోయారు.ఆ విధంగా మునుపటి సంవత్సరాలలోనూ ఈ ట్రెండ్ కనిపిస్తూ వస్తోంది.

ఈ సంఖ్యలను దృష్టిలో ఉంచుకుంటే, 1990ల మధ్యకాలంలో కెనడా మొత్తం జనాభాలో వలసలు 0.2 శాతంగా ఉన్నాయి.నేడు, ప్రభుత్వం అందించిన గణాంకాల ఆధారంగా ఆ సంఖ్య సుమారుగా 0.09 శాతానికి తగ్గింది.వలసదారుల హక్కుల కోసం వాదిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెనడియన్ సిటిజన్‌షిప్ ( Institute for Canadian Citizenship )(ICC) ప్రకారం కెనడా నుంచి వెళ్ళిపోతున్న వారి రేటు 2019లో ఇరవై సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.కోవిడ్-19 మహమ్మారి లాక్‌డౌన్‌ల సమయంలో వలసలు క్షీణించినప్పటికీ, రీసెంట్ ట్రెండ్ ప్రకారం ఆ సంఖ్య మళ్లీ పుంజుకుంటోందని స్పష్టమవుతోంది.

దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న జీవన వ్యయం అని విశ్లేషకులు చెబుతున్నారు.చాలా మంది వలసదారులు గృహ ఖర్చులు బాగా పెరగడం తమ నిర్ణయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.హౌసింగ్ ఆర్థిక భారం చాలా పెరిగిపోయిందని వారు చెప్పారు.సెప్టెంబరులో రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా( Royal Bank of Canada ) (RBC) నుండి వచ్చిన నివేదిక ప్రకారం, సగటు కెనడియన్ కుటుంబం తన ఆదాయంలో దాదాపు 60 శాతం ఇంటిని కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తుందని సూచిస్తుంది.
ఈ అధిక వ్యయం చాలా మందికి భరించలేనిది, అందువల్ల వారందరూ వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు.







