ఏపీలో నేటి నుంచి భూముల మార్కెట్ ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు పెరగనున్నాయి.కొన్ని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మాత్రమే ధరల సవరణ ఉండనుంది.
చాలా ప్రాంతాల్లో 29 నుంచి 31 శాతం మేర రేట్లను పెంచింది ప్రభుత్వం.ఈ క్రమంలో పెరిగిన ధరల ప్రకారమే ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని అధికారులు తెలిపారు.
కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పంచాయతీల వారీగా ఛార్జీల పెంపు కొనసాగుతుంది.ఈ మేరకు చదరపు గజాల ప్రాతిపదికన రేట్ల పెంపు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.







