ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతులు ఎంతమంది? ప్రభుత్వం ఎంతమందికి నష్ట పరిహారం చెల్లించింది.ఆత్మహత్యల విషయంలో జనసేనాని పవన కల్యాణ్ చెబుతున్న అంకెలు కరెక్టా? ప్రభుత్వం చెప్పే అంకెలు కరెక్టా? ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం 7 లక్షల చొప్పున పరిహారం చెల్లించిందని మంత్రులు చెబుతున్నారు.పవన్ తన యాత్రలో ఎక్కడా కౌలు రైతుల సర్టిఫికెట్ లేదా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతు కుటుంబాల్లో ఎవరికైనా పరిహారం ఇవ్వలేదని నిరూపించలేకపోయారని ప్రభుత్వం అంటోంది.అయితే 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ప్రభుత్వం సాయం చేసిందని జనసేన చెబుతోంది.
ప్రభుత్వ సాయానికి నోచుకోని కౌలు రైతు కుటుంబాలకు జనసేన తరపున ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం ఇస్తున్నారు.కౌలు రైతు భరోసా యాత్రం పేరుతో పవన్ అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు తీసుకుని వాటి ఆధారంగా సాయం చేస్తున్నారు.ఇందు కోసం పవన్ 5 కోట్లు కేటాయించారు.
గతంలో రైతులకు ఎటువంటి సాయం చేయని చంద్రబాబును ప్రశ్నించని పవన కల్యాణ్, ఇప్పుడు అన్నీ చేస్తున్న తనపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్ మళ్ళీ హీట్ పుట్టించింది.ఇంతకీ ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎందరు? ఎవరు చెప్పేది కరెక్ట్? ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలన్నిటికీ జగన్ సర్కార్ సాయం చేయలేదా? సాయం తప్పించుకోవడానికి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందా?ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందిచమని జగన్ ప్రభుత్వం చెబుతుంది .చంద్రబాబు కాలంలో రైతులకు ఏవిధంగా సహాయ పడలేదు అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.ఆనాడు ప్రశ్నించని పవన్, అన్నీ ఇస్తున్నతమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.