ఆ షాపింగ్‌ మాల్‌లో క్యాషియర్‌ కనిపించడు కానీ పేమెంట్‌ జరిగిపోతుంది?

సాధారణంగా మనం నిత్యావసర సరుకులు కొనాలని అనుకుంటే ఇంటి దగ్గరలో వున్న కిరాణా దుకాణానికో లేదంటే మార్కెట్‌కో వెళుతుంటాం కదా.అదే పెద్ద పెద్ద పట్టణాలలో అయితే షాపింగ్‌ స్టోర్‌కు వెళుతూ వుంటారు.

 In That Shopping Mall The Cashier Is Not Visible But The Payment Is Done, Shoppi-TeluguStop.com

ఈ క్రమంలో షాపింగ్‌మాల్‌లోకి వెళ్లిన తరువాత కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాక బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లి క్యాష్‌ పే చేస్తూ వుంటారు కదా.అయితే దుబాయ్‌లోని అతి పెద్ద మాల్ లో మాత్రం క్యాషియర్‌ అస్సలు కంటికి కనిపించడు.అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు.

Telugu Cashier, Dubai, Latest-Latest News - Telugu

మరి అలాంటప్పుడు సరుకులు తీసుకున్నాక క్యాష్‌ ఎలా పే చేయాలి? అనే ఆలోచన వస్తుంది కదా.ఇపుడు దానిగురించి తెలుసుకుందాం.యూఏఈలోని దుబాయ్‌( Dubai in UAE ) పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో విరాజిల్లుతూ… ఉంటుంది.

పగలంతా పడుకొని రాత్రి మేల్కొనే మహానుభావులు ఇక్కడ చాలామంది వుంటారు.ఎందుకంటే వారికి అప్పుడే తెల్లారుతుంది మరి.ఈ మహానగరంలో 2018లో అమెజాన్‌ కెరెఫోర్‌ మినీ అనే షాపింగ్‌ స్టోర్‌( Amazon Carrefour Mini is a shopping store ) తెరిచింది.ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది.

అయితే ఇది అత్యాధునిక స్టోర్‌గా దీనికి పేరొందింది.

Telugu Cashier, Dubai, Latest-Latest News - Telugu

ఈ స్టోర్‌లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ ఖచ్చితంగా ఉండాల్సిందే.లేదంటే ఈ స్టోర్‌లోనికి నో ఎంట్రీ.ఇక లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

స్టోర్‌లో హై రిజల్యూషన్‌ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి.స్టోర్‌లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులో ఆటోమేటిక్ గా ప్రత్యక్షమవుతాయి.

షాపింగ్‌ పూర్తయిన తరువాత పేమెంట్‌ ఫోను ద్వారా చేసేస్తే సరిపోతుంది.ప్రత్యేకించి ఇక్కడ క్యాష్ తీసుకోవడానికి అందుకే ఎవరూ వుండరు.

ఐడియా అదుర్స్ కదూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube