అక్క‌డ‌ టీడీపీని సెట్ చేయడం కష్టమే... బాబు చేతులు ఎత్తేశారా..!

మొన్నటివరకు టీడీపీకి కొద్దోగొప్పో బలం ఉన్న పార్లమెంట్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే.2019 ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ కేవలం 4 వేల ఓట్ల తేడాతో చేజార్చుకుంది.

అయితే ఏడు అసెంబ్లీ స్థానాల్లో 4 గెలిచి సత్తా చాటింది.

విశాఖ ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్ సీట్లు టీడీపీ గెలుచుకోగా, శృంగవరపుకోట, భీమిలి, గాజువాక స్థానాల్లో ఓటమి పాలైంది.ఇలా విశాఖలో బలంగా ఉన్న టీడీపీని, జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో బారి దెబ్బకొట్టారు.

విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చారు.చంద్రబాబు అమరావతికి మద్ధతు తెలపడంతో విశాఖ తమ్ముళ్ళకు ఇబ్బందులు మొదలయ్యాయి.

 అందుకే పలువురు పార్టీతో సంబంధం లేకుండా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడాన్ని స్వాగతించారు.అయితే ఇక్కడ నుంచే బాబు, విశాఖని పట్టించుకోవడం మానేశారు.

Advertisement

ఎంతసేపు అమరావతి చుట్టూనే తిరగడంతో విశాఖ తమ్ముళ్ళు హర్ట్ అయ్యారు.

ఈ క్రమంలోనే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీని వీడి జగన్‌కు జై కొట్టారు.అటు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రేపోమాపో టీడీపీని వీడటం ఖాయమని తెలుస్తోంది.ఇలాంటి సమయంలోనే బాబు పార్లమెంటరీ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు.

అందులో భాగంగా విశాఖకు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని అధ్యక్షుడుగా పెట్టారు.పల్లా, గంటాకు సన్నిహితుడన్న విషయం తెలిసిందే.

అయితే పల్లా విశాఖలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో అర్ధం కావడం లేదు.తన సొంత నియోజకవర్గంలోనే టీడీపీ వీక్‌గా ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అటు భీమిలిలో ఓడిన సబ్బం హరి ఇంటికే పరిమితమయ్యారు.గంటా వెళితే నార్త్‌లో టీడీపీకి దిక్కు ఉండదు.ఇప్పటికే సౌత్‌లో టీడీపీని నడిపించే నాయకుడు లేడు.

Advertisement

ఇక ఈస్ట్, వెస్ట్‌ల్లో మాత్రం కాస్త స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.అలాగే శృంగవరపుకోటలో కోళ్ళ లలితకుమారి పెద్ద యాక్టివ్‌గా లేరు.

ఇలా ఎన్నికల తర్వాత విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీ బాగా వీక్ అయింది.ఇదే పరిస్తితి కొనసాగితే జి‌వి‌ఎం‌సి ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టడం చాలా కష్టం.

మొత్తానికైతే విశాఖలో టీడీపీని సెట్ చేయడం చాలా కష్టమనే చెప్పొచ్చు.

తాజా వార్తలు