యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేసిన వర్షం సినిమా తో తను మొదటి హిట్ అందుకున్నాడు.ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో చాలా హిట్ సినిమాలు చేశాడు…ప్రభాస్ నటించిన ఆదిపురుష్( Adipurush ) సినిమా ఈ మధ్యనే అంటే జూన్ 16 న రిలీజ్ అయ్యింది.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి.
కానీ వీకెండ్ తర్వాత భారీగా తగ్గిపోయాయి.అయినప్ప్పటికీ ఈ చిత్రం రూ.175 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది.రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.200 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది.
సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ప్రభాస్ మార్కెట్ అయితే రూ.200 కోట్లు పైనే ఉందని ఆదిపురుష్ ప్రూవ్ చేసింది.బాలీవుడ్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ రావడం లేదు అంటూ అక్కడి పంపిణీదారులు నెత్తి, నోరు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ప్రభాస్ సినిమా అక్కడ వంద కోట్లు పైగా కలెక్షన్స్ ను రాబట్టడం అంటే చిన్న విషయం కాదు.
కర్ణాటక, ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ సినిమాలకి భారీ డిమాండ్ ఉంది.కాకపోతే రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ సినిమాలకి ఆశించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడటం లేదు.

అదెక్కడ అంటే.ఒకటి తమిళంలో, రెండోది మలయాళంలో( Malayalam ).! అవును ఈ రెండు చోట్ల ప్రభాస్ మార్కెట్ వీక్ గా కనిపిస్తుంది.అలా అని ఇక్కడ ప్రభాస్ కి మినిమమ్ మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు అనడం కరెక్ట్ కాదు.తమిళనాడు లో ‘ఆదిపురుష్’ మొదటి వారం రూ.2 .25 కోట్ల షేర్ ను రాబట్టింది.అది కూడా ప్రమోషన్ అలాగే సినిమాలో తమిళ నటీనటులు లేకుండా.! ఇక మలయాళంలో 80 లక్షల షేర్ ను రాబట్టింది.రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి కోటి షేర్ రావచ్చు.

ఇవి తీసిపారేసే కలెక్షన్స్ అయితే కాదు కానీ.ఈ రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ మార్కెట్ వీక్ గానే ఉంది అని స్పష్టమవుతుంది.ఇక ప్రభాస్ తో పాటు ఎన్టీయార్ కూడా ఈ రెండు ఏరియాల్లో కలక్షన్స్ పరంగా కొంత వీక్ అనే చెప్పాలి… అయితే విచిత్రంగా ఈ రెండు ఏరియాల్లో అల్లు అర్జున్ ( Allu Arjun )మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు.తమిళంలో పుష్ప( pushpa ) సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.
అలాగే కేరళలో అయితే అల్లు అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉంది.మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాల కంటే కూడా అల్లు అర్జున్ అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నాడు…
.