తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రభాస్ ( Prabhas ) సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.రీసెంట్ గా సలార్ ( Salar ) సినిమాతో 800 కోట్ల కలెక్షన్ వసూలు చేసిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక రాజసాబ్, కల్కి సినిమాలతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

అయితే సలార్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తన విజయాల పరంపరని కొనసాగించాలని చూస్తున్నాడు.ఈ సినిమా కోసం భారీ కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ప్రశాంత్ నీల్( Prashanth Neil ) ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కోసం బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.ఇక ఈ సినిమా కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం కూడా మన అందరికి తెలిసిందే… ఈ సినిమాని ప్రశాంత్ నీల్ చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక అద్భుతమైన ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాలో శృతిహాసన్ ( Shruti Haasan )హీరోయిన్ గా చాలా కామ్ గా ఉంది.అదే సలార్ 2 లో మాత్రం ఆమె క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.దానికి తగ్గట్టుగానే ఆమె లండన్ నుంచి ఇండియా రావడానికి కూడా సపరేట్ కారణం వల్ల వచ్చినట్టుగా కూడా సినిమాలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి ట్విస్ట్ లతో ఈ సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అయితే క్రియేట్ చేస్తుంది.మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







