దిష్టి బొమ్మలు ఉండటం మంచిది కాదంటున్నారు, నిజమేనా?

మనం ఊర్లలో మరియు సిటీల్లో ఎక్కువ శాతం ఇళ్ల ముందర దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు.ఇళ్ల సైజ్‌ను బట్టి దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు.

ఇంటిపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు, ఎవరి దిష్టి కూడా తగులకుండా ఉండేందుకు ఇలా దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు.కొత్త వాటికి దేనికి అయినా దిష్టి తగిలి వెంటనే నాశనం అయ్యే ప్రమాదం ఉందని, అందుకే దిష్టి బొమ్మలు పెడతామంటూ చాలా మంది అంటూ ఉంటారు.

దిష్టి బొమ్మలు చాలా రకాలు ఉంటాయి.దిష్టి బొమ్మల్లో ఎక్కువ శాతం రాక్షసుడి టైప్‌లో ఉండే బొమ్మలు ఉంటాయి.

వాటినే జనాలు తమ ఇళ్ల ముందర పెట్టుకుంటూ ఉంటారు.అయితే దిష్టి బొమ్మలు ఇంటి ముందు పెట్టుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
In Front Of House Disti Bomma Is Safe Or Danger-దిష్టి బొమ్

మొన్నటి వరకు ఇంటిపై దిష్టి పడకుండా ఉండేలా ఈ బొమ్మ ఉపయోగపడుతుందని అనుకున్నారు.కాని ఇప్పుడు కొందరు మరో వింత ప్రచారం మొదలు పెట్టారు.

ఈ బొమ్మలు ఉండటం వల్ల ఇంటికే నష్టం తప్ప లాభం లేదు అంటున్నారు.ముఖ్యంగా ఇంటికి చెడు దృష్టి ఏమో కాని ఎక్కువ శాతం రాక్షసులు ఇంటిపైకి వస్తారంటూ వారు చెబుతున్నారు.

In Front Of House Disti Bomma Is Safe Or Danger

   దిష్టి బొమ్మ అంటూ మనం రాక్షసుడి బొమ్మను పెడుతాం.దెయ్యం ఆకారంలో ఉండే ఆ బొమ్మను చూసి దుష్ట శక్తులు ఆకర్షింపబడుతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దిష్టి బొమ్మల కారణంగా కొన్ని సార్లు ఇంటిపైకి రాక్షసుల దాడి కూడా జరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

దిష్టి సంగతి దేవుడు ఎరుగు కాని ఇంటిపై రాక్షసుడి బొమ్మ పెట్టుకుని ఇతర రాక్షసులను మరియు దెయ్యాలను ఆహ్వానించినట్లే అంటూ వారు వింత వాదన చేస్తున్నారు.

In Front Of House Disti Bomma Is Safe Or Danger
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

   బొమ్మలు పెట్టుకుంటే రాక్షసులు మరియు దెయ్యాలు రావడం ఏంటీ నాన్సెన్స్‌ అనే వారు కూడా చాలా మందే ఉన్నారు.మరి ఈ వాదన ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.మొత్తానికి దిష్టి బొమ్మ విషయంలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు