తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపటిలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.ఈ మేరకు ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రజా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలుసుకోనున్నారు.ఈ నేపథ్యంలో ప్రజాభవన్ ముందు జనం భారీగా క్యూ కట్టారు.
అయితే ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రజాభవన్ కు రానున్నారు.అనంతరం ఆయన ప్రజలతో ముఖాముఖి కానున్నారు.
ఈ క్రమంలోనే ప్రజల నుంచి సీఎం రేవంత్ రెడ్డి వినతులు స్వీకరించనున్నారు.







