ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.వీటిని నమ్మి మోసపోతున్న ప్రజలు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.
అయితే వీరిలో కొందరు ధైర్యంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆన్‌లైన్ కంపెనీలకు గుణపాఠాలు నేర్పుతున్నారు.తాజాగా బెంగళూరు నివాసి సౌమ్య పి( Sowmya P ) కూడా ఫ్లిప్‌కార్ట్‌కు బుద్ధి చెప్పింది.
షాంపూ కొనుగోలుపై గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే రెట్టింపు వసూలు చేసినందుకు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై( Flipkart ) దావా వేసి ఎట్టకేలకు కేసు గెలిచింది.బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా, సౌమ్య ఫోన్‌పే ద్వారా రూ.191 చెల్లించి పతంజలి కేశ్ కాంతి( Patanjali Kesh Kanti ) హెయిర్ క్లెన్సర్‌ను ఆర్డర్ చేసింది.ప్రొడక్ట్ పొందిన తర్వాత, దానిపై MRP రూ.95 మాత్రమే ఉంది.ఎమ్ఆర్పీ తక్కువ ఉన్నా వెబ్‌సైట్‌లో దీని ధర ఎక్కువగా ఉందని గమనించిన సౌమ్య తీవ్ర అసంతృప్తికి గురైంది.
తాను మోసపోయానని బాధపడింది.

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను సంప్రదించినా తనకు న్యాయం జరగలేదు.దాంతో మరో మార్గం లేక ఆమె చట్టపరమైన చర్యలకు దిగింది.అయితే రీసెంట్ గా కన్జ్యూమర్ ఫోరమ్( Consumer Forum ) ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది, ఫ్లిప్‌కార్ట్ అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు పాల్పడినట్లు నిర్ధారించింది.సౌమ్య కేసులో తీర్పు వెలువరిస్తూ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సామ్య నుంచి అదనంగా వసూలు చేసిన రూ.96 రిఫండ్ చేయాలని ఆదేశించింది.అంతేకాదు, సర్వీస్ లోపానికి పరిహారంగా రూ.10,000, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు జరిమానాగా రూ.5,000, కోర్టు ఖర్చులుగా మరో రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.మొత్తంగా రూ.20,096 ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు చెల్లించేలా తీర్పు ఇచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువు ధరల్లో వ్యత్యాసాలు ఉంటే ఏ కస్టమర్ అయినా ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.అయితే ఈ కేసులను విచారించడానికి కొంత ఆలస్యం అవుతుంది కానీ అంతిమంగా న్యాయం మాత్రం జరుగుతుంది.ఈ విషయం చాలామంది కేసులలో నిజమయింది.







