స్వరం మార్చిన ఇమ్రాన్,కారణం!

మొన్నటి వరకు యుద్ధం అంటూ బీరాలు పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు.నిన్నటి వరకు చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలిపిన ఇమ్రాన్, ఇప్పుడు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయంటూ చెప్పుకొచ్చారు.

 Imrankhan Slowdown Overhis Talks Fatf-TeluguStop.com

అంతేకాకుండా ఎన్నటికీ కూడా యుద్ధం ప్రారంభించే ప్రసక్తే లేదంటూ కొత్త రాగం అందుకున్నారు.అణ్వస్త్రాలను ప్రయోగించబోమని తెలిపిన ఆయన యుద్ధంలో ఓడిన దేశంతో పాటు గెలిచిన దేశం కూడా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందన్నా రు.గత వారం వరకు కూడా యుద్దానికి సిద్ధం కండి అంటూ హెచ్చరికలు జారీ చేసిన ఇమ్రాన్ ఇప్పుడు చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అని, చర్చలు జరపాలని కోరారు.కాశ్మీర్ అంశం పై స్వయంగా ఐక్యరాజ్యసమితిలో స్వయంగా తానే మాట్లాడతానంటూ గొప్పలు పోయినప్పటికీ అంతర్జాతీయంగా ఆయనకు మద్ధతు రాకపోవడం తో అసలు విషయం బోధపడింది.

పైగా, FATF నిషేధ కత్తి మెడపై వేలాడుతుండడంతో ఇమ్రాన్ స్వరం లో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తుంది.ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇమ్రాన్ సర్కారుకు అక్టోబర్ వరకే గడువు ఉండగా,ఈ లోపు సరిగా వ్యవహరించకపోతే నిషేధం తప్పదని తెలుస్తుంది.

అదే జరిగితే పాకిస్థాన్‌కు పైసా అప్పు కూడా పుట్టాడు.ఇప్పటికే ఆర్ధిక సంక్షోభం తో అల్లాడుతున్న పాక్ ఇక నిషేదానికి గురైతే మాత్రం మరిన్ని ఆర్ధిక కష్టాలు తప్పేలా లేవు.

అయితే ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొనే ఇమ్రాన్ ఖాన్, ఇలా కాళ్లబేరానికి వస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube