టీఆర్ ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి

ఒకప్పుడు టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు ఆ పార్టీ లో ఏంతో హుషారుగా క్యాంపైన్ నిర్వహించిన సినీ నటి విజయశాంతి సరిగ్గా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరినప్పటి నుంచి కూడా టీఆర్ ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.

 Actressvijaya Shanti Once Againfires On Trsparty Kcr-TeluguStop.com

అయితే తాజాగా మరోసారి ఆమె గులాబీ జెండా పై పేస్ బుక్ వేదికగా మండిపడ్డారు.టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న ఆమె ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై అలానే ఇతర నేతలపై మండిపడ్డారు.

తెలంగాణలో జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం.కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ ఆమె పేర్కొన్నారు.

రాజకీయాల్లోనూ పాలనాపరంగానూ తనకు అందరికంటే ముందుచూపు ఉందని ప్రకటించుకునే కేసీఆర్ విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అలానే మంత్రి ఈటెల రాజేందర్ పై కూడా ఆమె కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube