మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో ఆ పంటను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.కానీ కొంతమంది రైతులు( Farmers ) పంటలపై సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.
ముందుగా ఏ పంట సాగు చేయాలో.ఆ పంటపై ముందుగా కల్పించుకోవాలి.
అయితే మార్కెట్లో ఈ మధ్యన మల్బరీ పండ్లకు ( mulberry fruits )మంచి డిమాండ్ ఉంటుంది.చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు.
ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలతో తెలుసుకుందాం.

ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు ( seeds )అనేవి ఉండవు.మల్బరీ చెట్ల కొమ్మలను కత్తిరించి, ఆ కొమ్మలను నాటుకొని సాగు చేయాలి.మల్బరీను రెండు రకాలుగా సాగు చేస్తారు.
ఒకటి పట్టుపురుగులకు ఆహారంగా మల్బరీను సాగు చేస్తారు.రెండవది మల్బరీ పండ్ల కోసం సాగు చేస్తారు.
పట్టు పురుగులకు ఆహారంగా మల్బరీని సాగు చేయాలనుకుంటే మొక్కల మధ్య ఒక అడుగు దూరం ఉండాలి.అలా కాకుండా మల్బరీ పండ్ల కోసం నాటుకునే మొక్కల మధ్య 15 అడుగుల దూరం ఉండాలి.
ఒక ఎకరం పొలంలో 240 మొక్కల వరకు నాటుకోవాలి.ఈ మొక్కలు నాటిన పది నెలల తర్వాత పండ్లు వస్తాయి.
ఈ పండ్లు ప్రతి కాలంలో వస్తాయి.ఎలాంటి వాతావరణం లో అయినా తట్టుకొని దిగుబడి ఇస్తాయి.

కానీ అధికంగా వర్షాలు కురిస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.అధిక దిగుబడి పొందాలంటే ఈ మల్బరీ పండ్ల చెట్లకు ప్రతి 45 రోజులకి ట్యూనింగ్ చేసుకోవాలి.అంటే ఆకులు మొత్తం కత్తిరించాలి.మళ్లీ 45 రోజులకి పూత వస్తుంది.ఇక పక్షులు, పిట్టలు ఈ పండ్లను అధికంగా ఆశిస్తాయి.వాటి నుండి సంరక్షించుకోవడం కోసం చేపల వల పొలం చుట్టు, చెట్టు పై భాగంలో కట్టుకోవాలి.
ఈ చెట్లకు చీడపీడల బెడద ఉండదు.ఒకసారి సేంద్రీయ ఎరువులు( Organic fertilizers ) వేసుకుంటే సరిపోతుంది.
ఒక ఎకరం పొలం నుంచి ప్రతిరోజు 100 కిలోల పండ్లు పొందవచ్చు.మార్కెట్లో కిలో దాదాపుగా ధర రూ.250 వరకు ఉంది.అంటే రోజుకు దాదాపుగా రూ.15 వేల రూపాయలకు పైగా ఆదాయం పొందవచ్చు.