రామబాణం అంటే ఏమిటి? దానికి ఎందుకు అంత విశిష్టత ఉంది?

రామ బాణం అంటే గురి తప్పనిది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి రామ బాణం అంటే అర్థం అది కాదట.

 దీని వెనుక పెద్ద కథనే ప్రాచుర్యంలో ఉందట. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రాముడి సోదరుడు లక్ష్మణుడు..

 రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు విడిచినప్పటికీ.

Advertisement
Importance Of Ramabanam , Devotional , Laxmanudu , Ramabanam , Sri Rama Chandru

 ఇంద్రజిత్తు చనిపోవడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని లక్ష్మణుడు ఓ ఉపాయం చేశాడు.

 తన సోదరుడైన రాముడి మీద ఒట్టు పెట్టాలి అనుకున్నాడు. ధర్మాత్యా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వందహా తదైనం జహి రావణిమ్ అంటూ ఓ బాణాన్ని సంధించగానే ఇంద్రజిత్తు తల తెగిపోయింది.

 లక్ష్మణుడు చదివిన ఆ శ్లోకానికి నా సోదరుడు రాముడు ధర్మాత్ముడు, నిజాలు మాట్లాడేవాడు, పౌరుష వంతుడు, దశరథుని కొడుకే గనుక అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించు గాక అని అర్థం. 

Importance Of Ramabanam , Devotional , Laxmanudu , Ramabanam , Sri Rama Chandru

అంటే రాముని మీద ఒట్టు పెట్టుకుని ప్రయోగించే ఈ బాణం రాముడంతటి శక్తిని కలిగి శత్రువును నిర్మూలిస్తుందని భావం. అప్పటి నుంచే రామ బాణం అనే పద ప్రయోగం వాడుకలోకి వచ్చింది. రామ బాణం అంటే గురి తప్పనిది కాదు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

 రాముడి మీద ఒట్టు పెట్టి ప్రయోగించేది. ఈ రామ బాణానికి ఏడు తాటి చెట్లను నరికేసే శక్తి ఉంటుందట.

Advertisement

 అంటే ఆయన నామానికి ఉన్న శక్తిని ఈ రామ బాణంతో పోల్చారు.

తాజా వార్తలు