ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత రాజకీయాల్లో బాగా పనిచేస్తుందతి.ఎందుకంటే పార్టీలో ముందు ఆ నాయుకుడు గెలిస్తే ఆ తర్వాత ప్రతిపక్షాలమీద గెలిచే అవకాశం ఉంటుంది.
అంతే గానీ పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత ఉంటే గనక ఇంక అంతే సంగతి.ఈ విషయంలో రాజకీయ చాణక్యుడు అయినటువంటి చంద్రబాబు మాత్రం ఎందుకో కాస్త వెనకపడ్డట్టు కనిపిస్తోంది.
రాజకీయ కురు వృద్ధుడిగా పేరు గాంచిన చంద్రబాబు వ్యూహాలు ఏ రాజకీయ నేతలకు కూడా అందవు.అలాంటి అనుభవం ఉన్న నేత ఇప్పుడు తన పార్టీ మీదే పట్టు కోల్పోతున్నారు.
ముందు తన పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థులను ఢీ కొట్టేందుకు రెడీ అయిపోతున్నారు.ఇది ఆయనకు పెద్ద మైనస్.ఎందుకంటే ముందు పార్టీని ఏక తాటిమీదకు తెస్తేనే ఆయన తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి.అలా కాకుండా అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీని, పార్టీ వ్యవహారాలను ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఇలా పార్టీలో ఏం జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా ఉండటంతో చివరకు అదే ఆయనకు ప్రమాదకరంగా మారిపోయింది.
పార్టీలో గత ఎన్నిక్లలో గెలిచిన 23 మందిలో ఇప్పటికే ఐదుగురు జంప్ అయ్యారు.

పైగా ఉన్న ఎమ్మెల్యులు కూడా చంద్రబాబు చేపట్టే కార్యక్రమాల్లో పెద్దగా రియాక్ట్ కావట్లేదు.పైగా పార్టీకోసం ఎప్పటి నుంచో పాతుకుపోయిన సీనియర్లను ఇంకా అందలం ఎక్కిస్తున్నారు.దాంతో కొత్త నాయకత్వం పుట్టుకు రావట్లేదు.ఇదే ఆయనకు పెద్ద దెబ్బ.యనమల రామకృష్ణుడు, జేసీ బ్రదర్స్ లాంటి వారు చంద్రబాబునే విమర్శిస్తున్నా అలాంటి వారిని పక్కన పెట్టుకుండా ఇంకా వారికే ప్రాముఖ్యత ఇవ్వడం కూడా చంద్రబాబుకు పెద్ద ఇబ్బందే అని చెప్పాలి.ఇలా పార్టీని ముందు లైన్ లో పెడితేనే ఆయనకు అధికారం దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.