గణేశ్ నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లోనే చేసి తీరుతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.నిమజ్జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
గత మూప్ఫై సంవత్సరాలుగా గణేశ్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేస్తూ వస్తున్నామన్న విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు.నిమజ్జనాలపై హైకోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాదులు సరైన వాదనలు వినిపించలేదన్నారు.
అందుకే ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని తెలిపారు.పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.







