కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు..!

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్లు కనుగొన్నారు.

ఈ వ్యాక్సిన్ల ప్రయోగాలు కూడా చివరిదశకు చేరుకోవడంతో మార్కెట్ లో వ్యాక్సిన్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.అయితే వ్యాక్సిన్ అభివృద్ధికి ఆర్థికంగా సాయపడాలని సూచించింది.

ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు చొరవతో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో వస్తుందన్నారు.దీని ఫలితంగా కరోనా బారి నుంచి త్వరగా కోలుకునే పరిస్థితి నెలకొంటుందన్నారు.

కరోనాపై ఫారెన్ పాలసీ మ్యాగజీన్ లో ఐఎంఎఫ్ ఓ వ్యాసాన్ని ప్రచురించింది.ఐఎంఎఫ్ మేనెజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జినా, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ వ్యాసంలో విధంగా పేర్కొన్నారు.

Advertisement

కరోనా కారణంగా 2021 ఏడాది చివరికి 12 లక్షల కోట్ల డాలర్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు.అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందని, ఆర్థికంగా వెనుకబడిన దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే 75 దేశాలకు ఐఎంఎఫ్ అత్యవసర నిధులు అందించిందన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 76 సంపన్న దేశాలు కరోనాను నియంత్రించడానికి కలిసికట్టుగా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.

త్వరలో వ్యాక్సిన్ అందుబాటులో వస్తే కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు