బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న కవిత ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయారు.పక్కనే ఉన్న స్థానిక గ్రంధాలయ ఛైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.
రెస్ట్ లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో కవిత కొంత అలసటకు లోను అవడంతో అస్వస్థతకు గురయ్యారని సమాచారం.కాగా కవిత ఎండ వేడిమి, రెస్ట్ లేస్ తో పాటు ఒత్తిడికి గురి కావడం కూడా కారణమని వైద్యులు చెప్పారని తెలుస్తోంది.