లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే సూర్యుడికి ఈ విధంగా అర్ఘ్యం సమర్పించాలి..!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య దేవుడిని ఆదిదేవుడుగా భావిస్తారు.ఈ సృష్టిలో శక్తికి కాంతి మూలం సూర్యుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అని కూడా పిలుస్తారు.ఈ క్రమంలోనే కొందరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మనం చూస్తుంటాము.

ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు.ఎవరి జాతకంలో అయితే సూర్య స్థానం బలహీనంగా ఉంటుందో అలాంటి వారు ఎన్నో ఇబ్బందులను ఆర్థికపరమైన కష్టాలను అనుభవిస్తారు.

ఈ విధంగా ఇలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలి అంటే సూర్యుడికి ఈ విధంగా నమస్కరించడం ఎంతో మంచిది.సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు.

Advertisement
If You Wast Lakshmi Devi Blessing If You Do Like This With-sun Lakshmi Devi, Su

అయితే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.ఆ నియమాలను పాటిస్తూ దేవుడిని నమస్కరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.

సూర్య దేవుడికి అర్ఘ్యం ఇచ్చేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి.ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి శుభ్రంగా స్నానమాచరించి ఉతికిన దుస్తులు ధరించిన అనంతరమే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

If You Wast Lakshmi Devi Blessing If You Do Like This With-sun Lakshmi Devi, Su

సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఉదయం ఎంతో అనువైన సమయం.ఈ సమయంలో అర్ఘ్యం ఇవ్వటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు.ఈ విధంగా మూడుసార్లు స్వామివారికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత భూదేవిని నమస్కరించి అనంతరం ఓం నమో సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.

ఈ విధంగా స్వామి వారికి అర్ఘ్యం సమర్పించే సమయంలో నీటిలో కాస్త అక్షింతలు ఎరుపు రంగు పుష్పాలను వేసుకొని సమర్పించాలి.అర్ఘ్యం సమర్పించిన అనంతరం పసుపు కుంకుమలు ధూపం సమర్పించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఇలా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు