స్ప్రౌట్స్ ను నేరుగా తినలేకపోతున్నారా..? ఇలా ట్రై చేస్తే టేస్ట్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా!

స్ప్రౌట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు.ఇటీవల రోజుల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

స్ప్రౌట్స్ లో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా స్ప్రౌట్స్ అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే చాలామంది స్ప్రౌట్స్ ను నేరుగా తినలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే వాటిని ఎవైడ్ చేస్తుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా స్ప్రౌట్స్ ను తయారు చేసుకుని తీసుకుంటే టేస్ట్ తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతమవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం స్ప్రౌట్స్ ను ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు స్ప్రౌట్స్ వేసుకోవాలి.

అలాగే అరకప్పు తరిగిన టమాటో ముక్కలు, అర కప్పు రెడ్ క్యాప్సికమ్‌ ముక్కలు, అరకప్పు ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, అర కప్పు కొబ్బరి ముక్కలు, అర కప్పు వేయించి పొట్టు తొలగించిన పల్లీలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు వేసుకోవాలి.చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మసాలా స్ప్రౌట్స్ చాట్‌ సిద్దమవుతుంది.

ఈ చాట్‌ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ఈ స్ప్రౌట్స్ చాట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వేగంగా వెయిట్ లాస్ అవుతారు.శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా సాగుతుంది.గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎముకలు కండరాలు స్ట్రాంగ్ గా మారతాయి.

చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా తయారవుతుంది.వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

జుట్టు రాలడం తగ్గి హెయిర్ గ్రోత్ సైతం రెట్టింపు అవుతుంది.

తాజా వార్తలు