బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ.ఈయన ఈ సినిమా ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకుని ఈ సినిమా తరువాత సినిమాలన్నింటినీ కూడా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.
ఇకపోతే బిచ్చగాడు సీక్వెల్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా కొన్ని యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరిస్తున్న సమయంలో మలేషియాలో ఈయన ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.

ఇలా ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటూ ఈయన ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి నటుడు విజయ్ ఆంటోని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ సందర్భంగా విజయ్ ఆంటోని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ….
డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) షూటింగ్ సమయంలో నేను ప్రమాదానికి గురయ్యాను.ఈ ప్రమాదంలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదం నుంచి తాను కోలుకున్నానని ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది.వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను.నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అంటూ విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు.ఇలా ఈయన తన ఆరోగ్యం గురించి తెలియజేయడమే కాకుండా తాను క్షేమంగా ఉన్నానంటూ థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఫోటోతో పాటు ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక విజయ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అభిమానులు సంబరపడుతున్నారు.







