కనిపిస్తే కబ్జా..మంత్రి సబితాపై తీగల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయా?.ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారా?.చెరువులు, కాలువలను కూడా హాంఫట్ చేసేస్తున్నారా.? సూళ్ల స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారా? అంటే అవునని టీఆర్ఎస్ నేతలే చెప్పడం హాట్ టాపిక్ అయింది.స్వయంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డే ఆరోపణలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

 If You See Kabja Thigala's Sensational Comments On Minister Sabita , Minister Sa-TeluguStop.com

మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గెలిచారు.

ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.ఆమెకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు.

ఇక అప్పటి నుంచి మహేశ్వరంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని సమాచారం.ఖాళీ స్థలాలు, చెరువులు, దేవాలయాల భూములు, ప్రైవేటు ల్యాండ్స్ ఆక్రమణకు గురవుతున్నాయని తెలుస్తోంది.

ఇదంతా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అండదండలతో జరుగుతున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఎప్పుడూ ఈ విషయాలు బయటకు రాలేదు.

కానీ ఇప్పుడు తీగల కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్‎లో కలకలం రేపుతున్నాయి.మహేశ్వరం నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగాయని.

మంత్రి సబితా ఇంద్రారెడ్డే పోత్రహిస్తున్నారని తీగల ఆరోపించారు.కబ్జాల్లో భాగంగా మీర్ పేట చెరువును నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.కబ్జాలను ఆపకపోతే తాను ఆమరణ దీక్షకు దిగతానని హెచ్చరించారు.

ఆక్రమణలపై సీఎంతో చర్చిస్తానని అన్నారు.

Telugu Kabjathigalas, Kabja Thigala, Sabita, Sabithaindra-Political

మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

మీరుపేటను సర్వనాశనం చేస్తునారని.అమరణ దీక్షకు దిగతానని తీగల హెచ్చరించారు.

ఇదిలా ఉంటే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంపై ఆయన స్పందించారు.

ప్రాణం ఉన్నంత వరకు టి.ఆర్.ఎస్ పార్టీలోనే ఉంటానని తీగల స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube