ఆధార్‌ కార్డు పోగొట్టుకున్నారా? అయితే, మళ్లీ ఇలా పొందవచ్చు!

ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యమైంది.దీని విలువ ఓ విధంగా ఓటు కార్డు కంటే ఎక్కువ.

 If You Lost Your Aadhar Card Here Is The Process That How To Get Online, Aadhar-TeluguStop.com

వ్యక్తి గుర్తింపు నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటా ఇది చాలా కీలమైంది.అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు పొందే సాంకేతికత వచ్చింది.

అయితే, ఒకవేళ మీ ఆధార్‌ కార్డు పోగొట్టుకుంటే ఏం చేస్తారు.మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌ ద్వారా తిరిగి మళ్లీ ఎలా సంపాదించాలో ఆ వివరాలు తెలుసుకుందాం.

యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్‌ కార్డు పోగొట్టుకున్న కార్డు దారులు తిరిగి సులభంగా ఎలా దరఖాస్తు చేయాలో తెలిపింది.

చాలా మందికి 12 నంబర్‌ల ఆధార్‌ నంబర్‌ గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు.అయితే, మీ రిజిస్ట్రర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ద్వారా తిరిగి ఆధార్‌ కార్డును పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం. ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌.

యూఐడీఏఐ.గవ్‌ ను ఓపెన్‌ చేయాలి.

–అందులో ‘ఆధార్‌ సర్వీసెస్‌ సెక్షన్‌’లోని ‘’పై ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది.– ఆ తర్వాత ‘ రిట్రీవ్‌ లాస్ట్‌ లేదా ఫర్‌గాటెన్‌ ఈఐడీ/ యూఐడీఏఐ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

అందులో మీ పేరు, ఈ మెయిల్‌ ఐడీ, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి.ఆ తర్వాత క్యాప్చాను వెరిఫై చేసి.

సెండ్‌ ఓటీపీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది.

ఆ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.మీ ఫోన్‌ నంబర్‌కు మీరు యూఐడీ లేదా ఈఐడీ నంబర్‌కు రిక్వెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.

అది ఇ–ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఆధార్‌ రీప్రింట్‌ చేసుకోవడం. దీనికి మళ్లీ యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది.ఠీఠీఠీ.

uజీఛ్చీజీ.జౌఠి.

జీn ఆ తర్వాత ‘ఆర్డర్‌ ఆధార్‌ రీప్రింట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.అప్పుడు ప్రొసీడ్‌ ఆధార్‌ నంబర్‌ (యూఐడీ), ఎన్రోల్‌మెంట్‌ ఐడీ (ఈఐడీ) లేదా వర్చువల్‌ ఐడీ (వీఐడీ)లలో ఏదైన ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది.

ఆ తర్వాత పేజీలోని నిబంధనల చెక్‌ బాక్స్‌పై క్లిక్‌ చేసి.‘సబ్మిట్‌’ బటన్‌పై ప్రెస్‌ చేయాలి.

ఇప్పుడు ఆధార్‌ కార్డు రీప్రింట్‌ తీసుకోవడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ లేదా అన్‌రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఒవవేళ మీ రిజిస్టర్డ్‌ నంబర్‌తో ఆధార్‌ నంబర్‌ లింక్‌ అయి ఉంటే మొదటి ఆప్షను ఎంచుకోవాలి.

ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, క్యాప్చాను నమోదు చేసి ‘రిక్వెస్ట్‌ ఓటీపీ’ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి.

మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.

ఆ తర్వాత ‘ఆన్‌లైన్‌ పేమెంట్‌ మోడ్‌ అండ్‌ పే’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.అప్పుడు ఎక్‌నాలేడ్జ్‌మెంట్‌ రిసీట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

పేమెంంట్‌ సక్సెస్‌ఫుల్‌ అయ్యాక.ఆధార్‌ కార్డు మీ ఇంటి అడ్రస్‌కు పంపిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube