కారు విండ్ షీల్డ్‌పై నల్లని చుక్కలు ఎందుకు ఉంటాయో తెలిస్తే...

కారు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మొదలైనవాటిని చాలా దగ్గరగా పరిశీలనగా చూస్తారు.ఇంతేకాకుండా ఆ కారుకు సంబంధించిన సమాచారాన్ని వంద చోట్ల అడిగిమరీ తెలుసుకుంటారు.

 If You Know Why There Are Black Dots On Car Windshield , Frits, Car Windshield,-TeluguStop.com

అయితే కారులోని ఒక ఒక ఉపకరణం అలా ఉండటానికి గల కారణం గురించి చాలామందికి తెలియదు.ఇంతకీ ఆ ఉపకరణమేమిటో, దానిలోని సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఉపకరణం గురించి మీరు కూడా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు.లేదా మీరు దీనిని ఎప్పుడూ గమనించి ఉండకపోవచ్చు.

అవును.ఇప్పుడు మనం కారు విండ్‌షీల్డ్‌పై నల్ల చుక్కల గురించి తెలుసుకోబోతున్నాం.

కారు విండ్‌షీల్డ్‌పై నల్ల చుక్కలు ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచించారా?.

Telugu Black Dots, Car Windshield, Frits, Window Glass, Windshield-Latest News -

నల్ల చుక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యతకారు వినియోగదారులు సైతం దీనిని కేవలం డిజైన్‌గా పరిగణిస్తారు.వాస్తవానికి దీనికి ప్రత్యేక ఉపయోగం ఉంది.ఈ నల్ల చుక్కలు చాలా ముఖ్యమైనవి.

వాటికి వాటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని గ్రహించండి.కారు విండ్‌షీల్డ్‌పై ఉండే ఈ చుక్కలను ఫ్రిట్స్ అని అంటారు.

విండ్‌షీల్డ్‌పై ఉన్న ఈ చిన్న నల్లని చుక్కలు విండ్‌షీల్డ్‌ను నిర్దేశిత స్థానంలో ఉంచడంలో సహాయపడతాయి.విండ్‌షీల్డ్‌పై ఈ నల్లటి చుక్కలు లేకుంటే కారు నడుపుతున్నప్పుడు విండ్‌షీల్డ్ డిస్‌లోకేషన్ అయ్యే అవకాశం ఉంది.

ఈ చుక్కలు లేకుంటే అది ఫ్రేమ్ నుండి విడిపోయి పడిపోతుంది.దీని వలన కారులోనివారికి గాయం అయ్యే అవకాశాలుంటాయి.

Telugu Black Dots, Car Windshield, Frits, Window Glass, Windshield-Latest News -

లుక్ అదుర్స్ఈ బ్లాక్‌డాట్‌ల కారణంగా కారు విండ్‌షీల్డ్ లుక్ అద్భుతంగా కనిపిస్తుంది.చాలామంది దీనిని అందమైన డిజైన్‌గా మాత్రమే భావిస్తారు.ఇది గాజు, జిగురు మధ్య బలమైన పట్టును సృష్టిస్తుంది.దీని కారణంగా విండ్ షీల్డ్ మరియు విండో గ్లాస్ ఒకదానికొకటి అతుక్కుంటాయి.వేడి ఎండ నుండి రక్షిస్తుంది ఇంతేకాకుండా బలమైన సూర్యకాంతి ఉన్నప్పుడు ఈ నల్ల చుక్కలు కారు లోపల ఉష్ణోగ్రతను నిర్వహిస్తాయి.బలమైన సూర్యకాంతి కారణంగా గాజులో ఉపయోగించే జిగురు పాడయిపోయే అవకాశం ఉంది.

ఈ నల్ల చుక్కల కారణంగా, జిగురు కరిగిపోయే అవకాశం అంతగా ఉండదు.మీ కారులోని విండ్ షీల్డ్‌కున్న నల్లని చుక్కలు తగ్గుతున్నట్లయితే, వీలైనంత త్వరగా వాటికి మరమ్మతు చేయించండి.

లేకపోతే మీ కారు గ్లాస్ వదులుగా మారవచ్చు.అప్పుడు మీరు చిక్కుల్లో పడే అవకాశం ఏర్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube