ఐఫోన్ అంటే ఎలాంటి మెరుగైన ఫీచర్లు ఉంటాయో అందరికీ తెలిసిందే.ఇక ఐఫోన్ 15 సిరీస్ తర్వాతి మోడల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.
ఐఫోన్ 16( iPhone 16 ), ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఈ 2024 ఏడాదిలో అద్భుతమైన మైమరిపించే ఫీచర్లతో లాంచ్ కానున్నాయి.ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
గత ఐఫోన్ 15 సిరీస్ మోడల్ కంటే ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్( iPhone 16 series smart phone chip set ), డిస్ ప్లే, కెమెరా, బ్యాటరీ అప్ గ్రేడ్ లు కలిగి ఉండనుంది.అంతేకాదు ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉండనున్నాయి.

ఐఫోన్ 16 సిరీస్ డిస్ ప్లే ( iPhone 16 series display )విషయానికి వస్తే.ఐఫోన్ 16 మోడల్ 6.1 అంగుళాల డిస్ ప్లే, ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7 అంగుళాల డిస్ ప్లే,ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.3 అంగుళాల డిస్ ప్లే,ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్ 6.9 అంగుళాల డిస్ ప్లే లతో ఉంటాయి.ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్, iOS 18 version పైన పనిచేసే అవకాశం ఉంది.ఈ సిరీస్ OS జనరేటివ్ AI సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
విజన్ OS తరహా డిజైన్ తో వస్తుంది.

ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లు సన్నని బెజెల్స్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.ఐఫోన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే.ఐఫోన్ 16 బేస్ మోడల్ 3561 mAh బ్యాటరీ సామర్థ్యం, ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 4006mAh బ్యాటరీ సామర్థ్యం, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 4676mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండి, 40W వైర్డ్ ఛార్జింగ్ మరియు 20w మెగ్ సెఫ్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేసే అవకాశం ఉంది.
కెమెరా విషయానికి వస్తే.ఐఫోన్ ప్రో మోడళ్లు 48ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంటాయి.ఐఫోన్ ప్రో మ్యాక్స్ హైబ్రిడ్ లెన్స్ లను కలిగి ఉండే అవకాశం ఉంది.5X టెలిఫోటో లెన్స్ తో ఉంటాయి.త్వరలోనే ఐఫోన్ 16 సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.







