ప్రశాంత్ కిషోర్ కంపెనీ I-PAC ఎలా పని చేస్తుందో తెలిస్తే..

ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC) ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవలి కాలంలో చర్చనీయాంశం అవుతున్నారు.

బీహార్‌లోని 17-18 వేల మందితో మాట్లాడి, ఆ తర్వాత 3000 కి.

మీ పాదయాత్ర చేపట్టి అవసరమైతే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఫ్రశాంత్ కిశోర్ ప్రకటించారు.బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ విజయం సాధించిన తర్వాత ఇకపై తాను ఎన్నికల వ్యూహాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.

అయితే ఇప్పటికీ అతను ఏదో ఒక పార్టీతో సంబంధం కలిగి ఉంటున్నారు.ప్రశాంత్ కిశోర్ I-PAC (I-PAC) అనే కంపెనీని నిర్వహిస్తున్నారు.ఈ కంపెనీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన ముగ్గురు సహచరులు ప్రతీక్ జైన్, రిషిరాజ్ సింగ్, వినేష్ చందేల్‌లతో కలిసి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG)ని స్థాపించారు.ఈ CAG తర్వాత పెద్ద కంపెనీగా రూపాంతరం చెందింది, దీనిని I-PAC అని పిలుస్తారు.

Advertisement

చాలా కాలంగా ఈ కంపెనీ పేరు పొలిటికల్ కారిడార్‌లో మారుమోగుతోంది.కంపెనీ ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్‌కి తోడుగా నిలిచిన రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందేల్ కంపెనీకి మూలస్తంభాలు.

PK తర్వాత, ఈ సహ వ్యవస్థాపకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తారు.అయితే ఈ ముగ్గురు కంపెనీకి డైరెక్టర్లు సామాజికంగా ముందుకు రాకపోవడం, చర్చలలో పాల్గొనకపోవడంపై అనేక విమర్శలున్నాయి.

ఈ ముగ్గురు యువల పాత్ర కంపెనీలో చాలా కీలకమైనది.iPAC ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

ఈ సంస్థ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో ఉంది.ఇందులో వివిధ అంతస్తులలో వివిధ పనులు జరుగుతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

iPACలో 12-15 విభాగాలు కలిసి పనిచేస్తాయి.వీటిలో ప్రధానంగా క్రియేటివ్, ఆపరేషన్స్, స్ట్రాటజిక్ రీసెర్చ్, పొలిటికల్ ఇంటెలిజెన్స్, లీడర్‌షిప్, లాజిస్టిక్స్, డేటా అనలిస్ట్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, డిజైనింగ్, ఫోటోగ్రాఫర్స్-ఎడిటర్స్ వంటి విభాగాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు