ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు( Cyber Crimes ) ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే.ఒకే ఒక క్లిక్ తో బ్యాంకులో దాచుకున్న డబ్బులు మొత్తం హ్యాకర్స్ దోచేస్తున్నారు.
సెల్ ఫోన్ వాడకం తెలియని చాలామంది పెద్దవాళ్లు మోసపోతున్నారు.ఇక ఇదే సమయంలో రకరకాల ఫేక్ ఫోన్ కాల్స్ ద్వారా కూడా హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఇంస్టాగ్రామ్ లో లైక్ లు( Instagram Likes ) కొడితే చాలు డబ్బులు ఇస్తామని ఓ వ్యక్తి వాట్సాప్ కి మెసేజ్ రావడం జరిగింది.ప్రతి లైకుకు 70 రూపాయలు ఇస్తామని అతనిని నమ్మించారు.
ఆ తర్వాత ఆ వ్యక్తితో క్రిప్టో కరెన్సీ( Crypto Currency ) లో పెట్టుబడి పెట్టించారు.తొలుత కొన్ని లాభాలు రావటంతో నమ్మకం కుదరటంతో ఆ వ్యక్తి చేత మళ్లీ 37 లక్షల రూపాయలు పెట్టించడం జరిగింది.
ఈ క్రమంలో తిరిగి డబ్బులు రాకపోవడంతో సదరు వ్యక్తి మోసపోయినట్లు గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.మొదట వర్క్ ఫ్రం హోం అని నమ్మించి ప్రారంభంలో కొన్ని డబ్బులు వచ్చేటట్టు చేసి తర్వాత ఆ వ్యక్తి దగ్గర మోసగాళ్లు భారీ ఎత్తున డబ్బులు కాజేయడం జరిగింది.