మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

గోర్లు పొడుగ్గా ఉంటే చేతులు అందంగా, అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి.అందుకే చాలా మంది అమ్మాయిలు పొడవాటి గోర్లను కోరుకుంటూ ఉంటారు.

అయితే కొందరికి నెయిల్స్ గ్రోత్( Nail growth ) అనేది సరిగ్గా ఉండదు.ఈ క్ర‌మంలోనే వేలకు వేలు ఖర్చుపెట్టి కృత్రిమ నెయిల్స్( Artificial nails ) ను అతికించుకుంటూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే.ఈ చిట్కాలను పాటిస్తే సహజంగానే మీ గోర్లు పొడుగ్గా, దృఢంగా పెరుగుతాయి.

మరి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

సాధారణంగా గుడ్డు పెంకులు( Eggshells ) ఎందుకో పనికి రావని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటాం.కానీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా గుడ్డు పెంకుల్లో ఉండే క్యాల్షియం నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి సహాయపడతాయి.

కొన్ని గుడ్డు పెంకులను తీసుకుని బాగా ఎండబెట్టి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గుడ్డు పెంకుల పొడిలో రెండు స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని గోర్లకు పట్టించి అరగంట పాటు వదిలేయాలి.అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చాలా వేగంగా పొడవాటి బలమైన గోర్లు మీ సొంతం అవుతాయి.

నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి విటమిన్ సి కూడా సహాయపడుతుంది.విటమిన్ సి లెమన్ జ్యూస్( Lemon juice ) లో మెండుగా ఉంటుంది.అయితే లెమన్ జ్యూస్ ను నేరుగా కాకుండా.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

ఆలివ్ ఆయిల్ ( Olive oil )క‌లిపి అప్లై చేయండి.వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని లైట్ గా హీట్ చేసి గోర్లకు అప్లై చేసుకోవాలి.

Advertisement

ఆపై బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ చిట్కాను పాటిస్తే.

మీ నెయిల్స్ అద్భుతంగా పెరుగుతాయి.ఇక ఈ చిట్కాలతో పాటు డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.

ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోండి.ఇవి నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి చక్కగా స‌హాయ‌పడతాయి.

అందమైన దృఢమైన పొడవాటి గోర్లు మీ సొంతం అయ్యేలా చేస్తాయి.

తాజా వార్తలు