ఈ టిప్స్ పాటిస్తే, మీ ల్యాప్‌టాప్‌ చార్జింగ్ ఎంతసేపైనా నిలుస్తుంది, కావాలంటే ట్రై చేయండి!

నేటి యువతకు ల్యాప్‌టాప్‌ తప్పనిసరి అయిపోయింది.చదువు, ఉద్యోగంలో భాగంగా ల్యాప్‌టాప్‌ ని వాడేవారి సమాఖ్య ఇపుడు విపరీతంగా పెరిగిపోయింది.

 If You Follow These Tips , Charging Your Laptop Will Last Longer , Laptop Tip ,-TeluguStop.com

అందుకే పలు కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ లను అందిస్తున్నాయి.అయితే ల్యాప్‌టాప్‌ వాడేవారికి ఓ సమస్య వేధిస్తూ ఉంటుంది.

అదే ఛార్జింగ్.అవును.

ల్యాప్‌టాప్‌ కొన్న కొత్తలో వున్న బేకప్ తరువాతి కాలంలో తగ్గిపోతూ ఉంటుంది.ఇదే ఇపుడు ప్రధాన సమస్యగా మారిపోతుంది.

ఎన్ని వేలు పెట్టి కొన్నా ఈ సమస్య మాత్రం సాల్వ్ కావడం లేదు.కాబట్టి దీనికి కొన్ని ప్రత్యామ్నాయ పెద్దలను అనుసరించడం ద్వారా ల్యాప్‌టాప్‌ బేటరీ బేకప్ ని పెంచుకొనే వీలుంది.

ల్యాప్‌టాప్‌లో ఎక్కువగా బ్యాటరీని వాడుకునే భాగం ఏదన్న వుంది అంతే అది స్క్రీన్.కాబట్టి బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేపు ఉండాలనుకున్నప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవడం ద్వారా చార్జింగ్ చాలా వరకు సేవ్ అవుతుంది.

అలాగే విండోస్ 10లో పవర్ సేవింగ్ సెట్టింగ్స్ ని మార్చుకోవడం ద్వారా కూడా పవర్ సేవింగ్ చేయొచ్చు.ఇక కొంతమందికి తెలియని విషయం ఏమంటే, వైర్‌లెస్‌ నెట్‌వర్క్ ఫీచర్లు అనేవి ల్యాప్‌టాప్‌ బ్యాటరీని ఎక్కువగా వాడుకుంటాయి కాబట్టి అవసరం లేని సమయాల్లో వైఫైని ఆఫ్ చేయాలి.

అలాగే వినియోగించనప్పుడు బ్లూటూత్‌ను బంద్ చేయాలి.ముఖ్యంగా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌లు, USB లాంటివి డేటా ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే తీసేయాలి.

లేకపోతే అవి కూడా పవర్‌ను వినియోగించుకుంటాయి.

Telugu Battery, Battery Backup, Tip, Latest-Latest News - Telugu

ఇంకా ఈ విషయాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.అదేమంటే ల్యాప్‌టాప్‌ పూర్తిగా బ్యాటరీ అయిపోయే లోపే చార్జింగ్ పెట్టుకోవాలి.సుమారు 20% తగ్గకముందే చార్జ్ పెడితే బెటర్.

అలాగే 100% పూర్తయిన తరువాత కూడా చాలా మంది గంటల గంటలు అలాగే చార్జింగ్ పెట్టి పని చేస్తుంటారు.ఇది కూడా మంచిది కాదు.బ్యాటరీ ఎక్కువ కాలం బాగా ఉండాలంటే, పూర్తిగా అయిపోయే ముందే చార్జ్ చేస్తూ.100% పూర్తయ్యాక ఆపేయాలి.అవసరం లేని సాఫ్ట్‌వేర్‌లు ఆటోస్టార్‌లో ఉంటే వాటిని డిసేబుల్ చేయండి.ల్యాప్‌టాప్‌ ఎక్కువగా హీట్ అయితే కూడా చార్జింగ్ త్వరగా అయిపోయే అవకాశాలు ఉంటాయి.అందుకే కూల్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube