సంక్రాంతి నాడు ఈ వస్తువులను దానం చేశారంటే.. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!

సాధారణంగా సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్నే మకర సంక్రాంతి అంటారు.

అయితే మకర సంక్రాంతి ముందున్న కాలం అంతా కూడా దక్షిణాయన కాలమని అలాగే సూర్యుడు మకర సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్యకాలము ప్రారంభం అవుతుంది.

అయితే సాధారణంగా దేవతలకు ఒక సంవత్సర కాలం ఒక రోజుతో సమానం.దక్షిణాయన కాలమును రాత్రి సమయమని, ఉత్తరాయన కాలమును పగటి సమయం అని చెబుతూ ఉంటారు.

ఇక దక్షిణాయన కాలంలో దేవతలు నిద్రిస్తూ ఉంటారు.ఇక ఉత్తరాయన కాలంలో మేలుకొని ఉండడం వలన ఉత్తరాయన కాలమును పుణ్యకాలం అని చెబుతారు.

ఇక ఈ సమయంలో దేవతలను కొలుచుకుని, దానధర్మాలు( Charities ) చేయడం వలన సకల పుణ్యాలు కలుగుతాయి.అయితే ఈ సమయంలో ఎలాంటి వస్తువులు దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మాసంలో నువ్వులను దానం చేయడం వలన సకల పాపాలు హరించి పోతాయి.

Advertisement

అయితే నువ్వులను ( Sesame seeds )దానం తీసుకోవడానికి చాలా మంది ఒప్పుకోరు.కాబట్టి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన చలిమిడి ఇస్తే అందరూ ఇష్టంగా తింటారు.

ఇక సాధారణంగా నువ్వులకు వేడి చేసే గుణం ఉంటుంది.కాబట్టి ఈ చలికాలంలో నువ్వులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక సంక్రాంతి సమయంలో పురాణాల ప్రకారం పెరుగు( curd ) దానం ఇవ్వడం వలన ఇంట్లో ఉన్న సకల పాపాలు, సకల కష్టాలు తొలగిపోతాయి.దీంతో అష్టైశ్వర్యాలు మన వాకిలి తొక్కుతాయి .కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే పెరుగు దానం ఇవ్వడం చాలా ఉత్తమం.ఇక పెళ్లి కానీ పిల్లలు కానీ, సంతానం లేక బాధపడుతున్న వారు కానీ మినుములు దానం ఇవ్వడం వలన వారి సమస్యలు తొలగి వెంటనే పెళ్లి కాని వారికి పెళ్లి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది.

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా ఈ మూడు వస్తువులను దానం చేయడానికి ప్రయత్నించాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు