పొరపాటున ఈ పనులు చేస్తే దురదృష్టం మీవెంటే.. కుటుంబంలో అభివృద్ధి ఉండదు!

సాధారణంగా కొన్ని సార్లు మనం ఇంట్లో మన వ్యవహారశైలిని బట్టి మన ఆర్థిక పరిస్థితులు మన ఇంట్లో పరిస్థితులు చక్కబడతాయి.

అలాగే మన ఇంట్లో ఏవైనా సమస్యలు వస్తే అది కేవలం మన వ్యవహారశైలిపై మన రోజువారీ జీవన విధానం పై ఆధారపడి ఉంటుంది.

ఈ క్రమంలోనే మన ఇంట్లో కొన్ని రకాల పనులను చేయడం ఎంతో అశుభంగా పరిగణిస్తారు.ఇలా కొన్ని రకాల పనులను చేయటం వల్ల మన ఇంట్లో దారిద్య్రం ఉంటుందని అందుకే కొన్ని పనులను ఇంట్లో చేయకూడదని పండితులు చెబుతున్నారు.

మరి ఎలాంటి పనులను ఇంట్లో చేయకూడదు అనే విషయానికి వస్తే.మన ఇంట్లో పూజగదిలో ఉన్నటువంటి ఏదైనా దేవతా విగ్రహాలు చీలిపోయిన లేదా విరిగిపోయిన వెంటనే వాటిని ఇంటి నుంచి తీసేయాలి అలాగే చెడిపోయిన లేదా పనికిరాని గడియారాలను కూడా ఇంటిలో ఉంచకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం మన పురోగతికి సూచిక.చెడిపోయిన గడియారం ఇంటిలో ఉంటే మన అభివృద్ధి కూడా అక్కడితో ఆగిపోతుంది.

Advertisement
Dont Do These Mistakes Otherwise Bad Luck For You Details, Life Mistakes, Bad L

మన ఇంటిలో వాయువ్య దిశ ఎల్లప్పుడూ సక్రమంగా ఉండాలి ఈ దిశలో కొన్ని లోపాలు తలెత్తిన ఇంటిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

Dont Do These Mistakes Otherwise Bad Luck For You Details, Life Mistakes, Bad L

సాధారణంగా చాలా మంది ఇంటి అలంకరణ కోసం కొన్ని రకాల మొక్కలను నాటుతారు.ఈ క్రమంలోనే ఇంటి ఆవరణంలో కాక్టస్ జాతికి చెందిన మొక్కలు పెంచడం పరమ దరిద్రం.చాలామంది వారి పడక గదిలో మంచం కింద చెప్పులు వదులుతూ పడుకుంటారు ఇలా ఉండటం పూర్తిగా అశుభం.

అలాగే ఇంటిలో పాత వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆర్థికాభివృద్ధి, మనశ్శాంతి కలుగుతాయి.పొరపాటున కూడా ఈ విధమైనటువంటి తప్పులు చేయటం వల్ల మన ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకోనీ కూర్చుంటుంది.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు