అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండి..: మాజీ మంత్రి బాలినేని

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది తన కోరికని చెప్పారు.

 If You Commit Illegalities, Slap Them..: Former Minister Balineni-TeluguStop.com

కానీ ఇళ్ల పట్టాలకు సంబంధించి తనపై కొందరు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండన్న ఆయన ఇళ్ల పట్టాల వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నెల 25వ తేదీ లోపు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.పేదల ఇళ్ల పట్టాల కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశానని పేర్కొన్నారు.

అలాంటిది కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube