అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండి..: మాజీ మంత్రి బాలినేని
TeluguStop.com
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది తన కోరికని చెప్పారు.
కానీ ఇళ్ల పట్టాలకు సంబంధించి తనపై కొందరు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండన్న ఆయన ఇళ్ల పట్టాల వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నెల 25వ తేదీ లోపు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
పేదల ఇళ్ల పట్టాల కోసం తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశానని పేర్కొన్నారు.
అలాంటిది కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండని వెల్లడించారు.
వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?