Mahindra XUV700 Mahindra Scorpio-N : 7-సీటర్ SUV కొనాలని భావిస్తే, ఈ టాప్ 5 కార్లు ట్రై చేయండి!

కాలం మారింది.కారు వాడకం అనేది నేడు సర్వసాధారణం అయిపోయింది.

ఒకప్పుడు కారు ఉన్నవాళ్ళని చాలా రిచ్ అని అనుకునేవారు.కానీ నేడు ఓ సాధారణ ఉద్యోగి కూడా తనకి ఉన్నంతలో కారుని కొనుగోలు చేస్తున్నాడు.

తమ ఫ్యామిలీతో దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత కార్లనే సేఫ్ గా ఫీల్ అవుతున్నారు.మరీ ముఖ్యంగా 7-సీటర్ కార్లను కొనుగోలుచేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఎందుకంటే అలాంటి కారు ఉంటే ఇక దాదాపు 10 మందైనా అడ్జెస్ట్ కావచ్చు.అలాంటి వారి కోసం ఇపుడు టాప్-5 7-సీటర్ కార్లను గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

ముందుగా మహీంద్రా కంపెనీకి సంబంధించిన అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన ఎక్స్​యూవీ700 7 సీటర్ కారుని పరిశీలించవచ్చు.దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్మడు పోతున్న కారు ఇది.అయితే ఈ SUV బుక్ చేసుకున్న వారు కొన్ని వేరియంట్స్ డెలివరీ కోసం కనీసం 2 సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.వాటికి అంత డిమాండ్ మరి.మహీంద్రా XUV700 ధరలు రూ.15.9 లక్షల నుంచి రూ.29.77 లక్షల వరకు ఉన్నాయి.ఇక రెండవది మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా 7 సీటర్ విభాగంలో మంచి ఆదరణ పొందిన కారుగా పేరు సంపాదించుకుంది.

ఈ SUV బుక్ చేసుకున్న కూడా కొనుగోలుదారులు డెలివరీ కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

ఆ తరువాత హ్యుందాయ్ కంపెనీ యొక్క ఆల్కజార్ SUV కూడా దేశీయ కారు గురించి చెప్పుకోవచ్చు.మార్కెట్లో ఇది మంచి ఆదరణ పొందిన 7 సీటర్ కారు.MG మోటార్స్ యొక్క హెక్టర్ ప్లస్ కూడా 7-సీటర్ విభాగంలో మంచి డిమాండ్ ఉన్న SUV.ఇది మంచి లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉంది.వీటన్నిటిలో LED DRL, ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద ఎయిర్ డ్యామ్ వంటివి ఉంటాయి.హెక్టర్ ప్లస్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి.పెట్రోల్ ఇంజన్ 141 BHP, 250 NM టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 168 BHP, 350 NM టార్క్‌ అందిస్తుంది.

పూర్తి వివరాలకు సంబంధిత సైట్స్ చూడగలరు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు