కిడ్నీలలో రాళ్లు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అందులో ముఖ్యమైనవి కిడ్నీల సమస్యలు( Kidney problems ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చాలామంది ప్రజలలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి.దీని వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.

దీని కోసం వాముతో ఇలా చేస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.

జీవనశైలి మారిపోవడం, నీటిని సరిగ్గా తాగకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఒంటి కారణాలతో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి.

If You Are Suffering From Kidney Stones Then This Is For You , Kidney Problems,
Advertisement
If You Are Suffering From Kidney Stones Then This Is For You , Kidney Problems,

అలాగే కిడ్నీలలో రాళ్లు ఉన్నప్పుడు మూత్ర విసర్జన ( urination )సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.కిడ్నీలలో రాళ్ల సమస్య తొందరగా నివారించుకోవాలి.లేకపోతే అది ఆపరేషన్ వరకు వెళ్తుంది.

కిడ్నీలలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు మందులు వాడుతూ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.కిడ్నీలో రాళ్లను కరిగించడానికి మన వంటింట్లో ఉండే వాము( vamu ) చాలా బాగా పనిచేస్తుంది.

వాములో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎన్నో రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

If You Are Suffering From Kidney Stones Then This Is For You , Kidney Problems,

వాము ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.అయితే కిడ్నీలో రాళ్ల సమస్యకు వామును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.నీటిలో వామును వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి స్పూన్ తేనె( honey ) కలిపి తాగాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే కిడ్నీలలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.అయితే వామును మరొక విధంగా కూడా తీసుకోవచ్చు.వామును డ్రై రోస్ట్ చేసి పౌడర్ గా చేసుకొని పెట్టుకోవాలి.

Advertisement

ఒక గ్లాస్ మజ్జిగలో పావు టీ స్పూన్ వాము పొడిని కలుపుకొని తాగాలి.ఇప్పుడు చెప్పిన ఈ రెండు రెమెడీలలో ఏది ఉపయోగించిన మంచి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు