విజయనగరం జిల్లా గణపతినగరం నియోజకవర్గ టీడీపీలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ ఒక్కటయ్యారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ( TDP ) నుంచి టికెట్ తమకి దక్కకపోవడంతో ఇరువురు నేతలు ఐదేళ్ల వైరాన్ని వీడి కలిసిపోయారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటైంది.
కాగా ఐదేళ్లుగా రెండు వర్గాలుగా ఉంటూ పార్టీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటాపోటీగా తలపడిన సంగతి తెలిసిందే.వీరిద్దరికీ కాకుండా కొండపల్లి శ్రీనివాసరావుకి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు.ఈ క్రమంలోనే కొండపల్లి శ్రీనివాసరావు( Srinivas Kondapalli )కు టికెట్ ఇవ్వడంపై గత కొంత కాలంగా కేఏ నాయుడు వర్గీయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.తనకి కాకున్నా కరణం శివరామకృష్ణ( Karanam SivaramaKrishna )కు అయినా టికెట్ ఇవ్వాలని త్వరలో అధిష్టానాన్ని కలవాలని కేఏ నాయుడు భావిస్తున్నారని తెలుస్తోంది.