ఇక్క‌డ గెలిస్తే పార్టీకి అధికారం ద‌క్కిన‌ట్టే.. అందుకే బాబు స్పెష‌ల్ ఫోక‌స్‌..?

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.మే నెలలో నిర్వహించిన మహానాడు అంచనాలకు మించి విజయవంతం కావడం, ఆ తర్వాత చేపట్టిన బాదుడే బాదుడు మినీ మహానాడు కార్యక్రమాలు కూడా సక్సెస్ కావడంతో టీడీపీ సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 If We Win Here, The Party Will Get Power That S Why Babu Is Special Focus, Chand-TeluguStop.com

అయితే,రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.సైకిల్ పార్టీకి 75 చోట్ల ఇన్చార్జులు లేరని స్పష్టం అవుతోంది.ఇటీవల కార్యకర్తలతో మాట్లాడిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇదే విషయాన్ని గుర్తుచేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన కొందరు రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలకు పరిమితమైపోయారు.

మరికొన్ని చోట్ల అధికార పార్టీలో చేరిపోయారు.

మరికొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీ (గన్నవరం) వాసుపల్లి గణేశ్ (విశాఖ సౌత్) మద్దాలి గిరి (గుంటూరు పశ్చిమ) కరణం బలరాం (చీరాల) వంటి నేతలు వైఎస్సార్సీపీతో దోస్తీ చేస్తున్నారు.మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జులు క్రియాశీలకంగా లేరని సమాచారం.

ఇలా మొత్తం మీద 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జుల కొరత ఉందని సమాచారం.

Telugu Chandra Babu, Cm Jagan, Karanm Balaram, Maddali Giri-Political

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ ఈ 75 నియోజకవర్గాలపై ముందు దృష్టి సారించాలని చెబుతున్నారు.టీడీపీలో ఉన్న లీడర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లను గంపగుత్తగా పొందాలని భావిస్తున్నారట.ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ (ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) జిల్లాల్లోనే టీడీపీకి నియోజకవర్గాల ఇన్చార్జుల కొరత ఉందని అంటున్నారు.

గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో టీడీపీ చావుదెబ్బ తిందని గుర్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇన్చార్జులు లేని 75 నియోజకవర్గాల మీద దృష్టి సారించకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు గొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube