ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయినవాళ్లను కూడా మనం చాలామందిని చూశాం.
ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా మంది వివిధ రకాల సాహసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలానే చూసాం.ఆ మధ్యకాలంలో రైలుతో( train ) పాటు పరుగులు తీసి ఒక వ్యక్తి కాళ్లు చేతులు కోల్పోయిన సంఘటన మనం చూసాం.
అచ్చం ఒక వ్యక్తి తన రెండు కాళ్లను కోల్పోయిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.సోషల్ మీడియాలో ( social media ) వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యువకుడు ట్రాక్టర్ కు ఉండే భారీ చక్రాన్ని తన రెండు కాళ్లతో పైకి లేపాలని ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో కింద కూర్చొని జారబెట్టి కూర్చొని రెండు కాళ్ళను ట్రాక్టర్ చక్రం పై పెట్టి దానిని పైకి లేపే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో అంత బరువును ఆ కాళ్లు మోయలేకపోయి చివరికు రెండు కాళ్లు ముక్కలుగా విరిగిపోయాయి.
కళ్ళముందే అంత భారీ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా భయపడి పోయారు.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ ఇలాంటి సాహసాలు చేయడం అవసరమా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా వీడియోను చూసి మీకేమి అనిపించిందో కామెంట్ చేయండి.








