విశాఖ నగర వార్డు కార్పొరేషన్ కార్యాలయం మరియు అన్ని ఎమ్మెస్ ఎఫ్ లు ఉదయం 6:00 నుండి మున్సిపల్ కార్మికులకి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు పడాల రమణ.పాల్గొని ప్రసంగించారు ఈ సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా.
ఏఐటీయూసీ మరియు సిఐటియు ఇతర కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్ వాహనాలను తెల్లవారుజామున 6 గంటల నుంచి నిలుపుదల చేసి జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.హెల్త్ అలవెన్స్ బకాయిలతో సహా చెల్లించాలి 11వ పిఆర్సి సిఫారసుల ప్రకారం నెల జీతం 20వేల రూపాయలు కరువు భత్యం చెల్లించాలి మున్సిపల్ పారిశుద్ధి ఇంజనీరింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 18 వేల రూపాయలు మున్సిపల్ కార్మికుల జీతం చెల్లిస్తానని చెప్పిన జనవరి నుండి 15 వేల రూపాయల మాత్రం ఎందుకు ఇస్తున్నారు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రిటైర్డ్ చేసిన వారికి రిటైర్డ్ బెనిఫిట్స్ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని రిటైర్డ్ బెనిఫిట్స్ గ్రాడ్యుటి పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని .NMR వర్కర్స్ కు కరువు టైమ్ స్కేల్ ఇవ్వాలని అలాగే కరువు భత్యం స్కూలు ఆయాలకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మిక సమస్యలు పరిష్కార ఎంతవరకు సమ్మె కొనసాగుతాదని ఆ సమ్మెకు ఏఐటీయూసీ ఎర్రజెండాలు అండగా ఉంటాదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ.సీఐటీయూ.
నాయకులు కే.సత్యనారాయణ.జి ప్రకాష్.జి సుబ్బారావు పి వెంకట్ రెడ్డి.పిట్టా కిషోర్.డోలా ప్రసాద్ .k.రాజు.వరప్రసాద్ టీ నూకరాజు నాగ ఆప్పరావు శేఖర్.సిరా రమణ మున్సిపలతదితరులు పాల్గొన్నారు.